వందేమాతరం.. ఈ నినాదం కోట్లాది మంది భారతీయులను ఏకం చేసింది. స్వతంత్ర పోరాటంలో ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపి కోలోనియల్ పాలనకు చరమగీతం పాడడంలో కీలక పాత్ర పోషించింది. బంకించంద్ర ఛటర్జీ కలం నుండి జాలువారిన ఈ జాతీయం గీతం ఆయన రచించించిన ఆనంద్ మఠ్ నుండి సంగ్రహించబడింది. ఈ గీతం, ఆ పదం స్వతత్ర పోరాటంలో సమరశంఖమై గర్జించింది.
Also Read : కడప నుండీ దేశం గర్వపడే స్థాయికి.. అద్భుతం సృష్టించిన తెలుగమ్మాయి
1975 వ సంవత్సరం నవంబర్ 7వ తేదీన బంగా దర్శన్ అనే లిటరరీ జర్నల్ లో మొట్టమొదటి సారిగా ఈ గీతం ప్రచురితమైంది. ఆ అద్భుతం అవిష్కృతమై ఈ రోజుకు సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తయింది. ఈ గీతాన్ని దేశానికి సంబందించిన మూడు ముఖ్యమైన ఆధారాలను ప్రతిబింబిస్తూ రాసారు బంకించంద్ర ఛటర్జీ. భిన్నత్వంలో ఏకత్వం, పుట్టిన గడ్డపై ఇది మనది అన్న ప్రేమ, దేశం మీద భక్తి అనే ఈ మూడు సూత్రాలే స్వాతంత్య్ర ఉద్యమానికి మూలంగా నిలిచాయి. ఇవే ఈ గీతం విన్న ప్రతిసారీ ఈనాటికి కూడా ప్రతి భారతీయుడి గుండెల్లో ఉప్పొంగే భావోద్వేగానికి కారణం కావడం గమనార్హం.
Also Read : BREAKING NEWS : ఇరగదీసిన ఆడ పులులు.. విశ్వ విజేతగా భారత జట్టు
ఈ 150 ఏళ్ల సందర్భాన్ని పురస్కరించుకుని సాంస్కృతిక శాఖ ఈ సంవత్సరం మొత్తం కూడా వేడుకలను నిర్వహించనుంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 9:50 నిమిషాలకు భారత దేశంలోని ప్రతి ఒక్కరు ఎక్కడ ఉంటే అక్కడ లేచి నిలబడి ఈ గీతాన్ని అలపించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీంతో మరొక్కసారి భారతీయుల గుండె చప్పుడు గా నిలిచిన ఈ గీతం, 140 కోట్ల గోతులకలలో ఒక్కసారిగా ప్రతిధ్వనించనుంది.
జై హింద్.. వందేమాతరం….
